మత సామరస్యానికి ప్రతీక మొహర్రం

సోమ‌శిల శ్రీ‌మ‌స్తాన్ బాబా ద‌ర్గాని సంద‌ర్శించిన ఎంపీ వేమిరెడ్డి

మత సామరస్యానికి ప్రతీక మొహర్రం
సోమ‌శిల శ్రీ‌మ‌స్తాన్ బాబా ద‌ర్గాని సంద‌ర్శించిన ఎంపీ వేమిరెడ్డి

మత సామరస్యానికి ప్రతీక మొహర్రం అని, ప్రతి ఒక్కరు మొహర్రం నెలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఆత్మకూరు నియోజకవర్గం సోమశిలలో శ్రీ మస్తాన్ బాబా ద‌ర్గాని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈసంద‌ర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గ్రామస్తులు, దర్గా ముజావర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి బాబాకి చద్దర్లు అందించారు. ముజావర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మొహర్రం త్యాగానికి ప్రతీక అని, దేశవ్యాప్తంగా కుల మతాలకతీతంగా జరుపుకునే పర్వదినం అన్నారు. మొహర్రం నెల సందర్భంగా ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో అనంతసాగరం దర్గా పీఠాధిపతి సాని సాహెబ్, టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరి రెడ్డి, దర్గా ముజావర్లు మరియు స్థానిక నాయకులు మహమ్మద్ హుస్సేన్, ఖాదర్ బాషా, షరీఫ్, మహమ్మద్ రెహమాన్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *