వీఎస్‌యూలో డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుచేయాలి
వీసీకి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు
పవన్‌కళ్యాణ్ ఫోటో లేకపోవడం బాదాకరం
వీఎస్‌యూలో డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుచేయాలి
వీసీకి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు
నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరులోని అక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, చాంబర్లలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్శిటీలో, రాష్ట్రానికి మారుమూల ఉన్న శ్రీకాకుళంలోని అంబేద్కర్ యూనివర్శిటీలో, అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ తో సహా అనేక యూనివర్శిటీలలోని వీసీ, రిజిస్ట్రార్ ఛాంబర్లలో పవన్ కళ్యాణ్ ఫోటోని ఏర్పాటుచేసి ఉన్నారని.. ఆయనకు ఎంతో అనుబంధం ఉన్న నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీలో పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని పొందుపరచకపోవడం ఆయన్ని అభిమానించే లక్షలాది మంది నెల్లూరు ప్రజలను భాదిస్తోందన్నారు. వీఎస్‌యూలో కూటమి ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని పొందుపరచకపోవడం చాలా దురదృష్టకరం అన్నారు.