తూపిలిపాళెంలో పరిశీలించిన ఇండస్ట్రీయల్ ఎండీ
జేసీ, సబ్ కలెక్టర్ తో కలసి భూముల పరిశీలన
నౌకాశ్రయం కోసం భూముల పరిశీలన
- తూపిలిపాళెంలో పరిశీలించిన ఇండస్ట్రీయల్ ఎండీ
- జేసీ, సబ్ కలెక్టర్ తో కలసి భూముల పరిశీలన
తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో నౌకాశ్రయం నిర్మాణం ఏర్పాటు చేసేందుకు సంబంధించిన భూములను స్టేట్ ఇండస్ట్రీయల్ ఎండీ యువరాజు పరిశీలించారు. వాకాడు మండలంలోని తూలిపిపాళెం సముద్ర తీరంలో తిరుపతి జేసీ, గూడూరు సబ్ కలెక్టర్ తదితరులతో కలసి ఇప్పటికే సేకరించిన భూములను పరిశీలించారు. పరిశీలనకు వచ్చిన అధికారులకు బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి వివరాలను క్షుణ్ణంగా వివరించారు. రైతుల స్థితిగతులను అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గ్రామస్థులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాకాడు తాహిసిల్దార్ రామయ్య, ఆర్ ఐ అఖిల్ యాదవ్, తూపిలిపాలెం గ్రామ కాపులు ఆర్కాటి మహేంద్ర, వావిలాల సుబ్రహ్మణ్యం, పామంజి గోవిందు తదితరులు పాల్గొన్నారు.