ఇంటింటికెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన వేమిరెడ్డి, బీద
ఇందుకూరుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు
- ఇంటింటికెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన వేమిరెడ్డి, బీద
రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొని ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలసి…ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పర్యటించారు. ఇరువురికి స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని డేవిస్ పేట, ఆదెమ్మ సత్రం గ్రామాల్లోని ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం సభలో సుపరిపాలనపై బీద రవిచంద్ర, వేమిరెడ్డిలు ప్రసంగించారు. సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు ఏకోలు పవన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు కార్యవర్గ సభ్యులు పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు, ఉప సర్పంచ్ కదురు రాదా కిష్ణ రెడ్డి, ఉప అధ్యక్షులు కూకటి వెంకటేశ్వల్లు రెడ్డి,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..