సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
అవినీతి రహిత నియోజకవర్గంగా కోవూరుని తీర్చిదిద్దుతాం
- సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
నెల్లూరు జిల్లా కొడవలూరను మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని యల్లాయపాళెం పంచాయతీలోని రామాపురం, ఎన్టీఆర్ కాలనీలలో ఇంటింటికెళ్లి….సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం వివరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం తోపాటు ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు అని తెలిపారు. అవినీతి రహిత నియోజకవర్గంగా ఈ కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామని ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నామని తెలిపారు. చికెన్ వ్యర్ధాలను 90 శాతం అరికట్టాలని, రేషన్ బియ్యాన్ని మాఫియా చేతుల్లోకి వెళ్లకుండా పకడ్బంది ఏర్పాట్లు అధికారులతో కలిసి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.