మీడియా సమావేశంలో కమిషనర్ వై.ఓ నందన్
కోర్టు కేసుల మాఫీకి అవకాశం
- మీడియా సమావేశంలో కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను ఎగవేతదారులు, అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి అదనపు అంతస్తులు చేపట్టిన నిర్మాణ యజమానులుపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ….నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను ఎగవేత దారులు 265 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమన్లు జారీ చేసి ఉన్నారన్నారు. వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ కు హాజరై బకాయీల మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి కేసులను మాఫీ చేయించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావు పాల్గొన్నారు.