వైద్యుల నిర్లక్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి
ఆ దావాఖానావద్ద ఆందోళన
కలెక్టర్ భార్య కాన్పు చేయించుకుందని
ఆ.. ఆసుపత్రికి కాన్పుకు వెళ్తే..!
వైద్యుల నిర్లక్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి
ఆ దావాఖానావద్ద ఆందోళన
కొత్తగూడెం.. జిల్లా కలెక్టర్ సతీమణి ఆ ప్రభుత్వ దావాఖానాలో ప్రసవించింది.. జిల్లాకు కలెక్టర్ అయి ఉండి కూడా.. తన భార్యకు ప్రభుత్వ దావాఖానాలోనే ప్రసవం చేయించిన ఆ కలెక్టర్‌ను అంతా మెచ్చుకున్నారు. ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది ఎంతో నైపుణ్యంగలవారని.. ఆధునిక పరికరాలున్నాయని.. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోవనడానికి ఇదో ఉదాహరణ అంటూ.. అటు జిల్లా ప్రజానికం.. ఇటు పత్రికలు, మీడియా ప్రశంశించాయి. ఇది జిరిగి.. రోజులు గడవక ముందే.. ఆ దావాఖానాలో సుఖ ప్రసవం చేస్తారని.. తల్లిబిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని.. నిన్న డాక్టర్స్ డే రోజున.. కొత్తగూడెం జిల్లా.. లక్ష్మీదేవిపల్లి మండలం.. తోకబంగారం గ్రామానికి చెందిన నిండు గర్భిణి కాన్పుకోసం ఆ ఆసుపత్రిలో చేరింది. కుటుంబ సభ్యులంతా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లమన్నా.. వద్దు.. వద్దు.. ఆ దావాఖానాలో మంచి డాక్టర్లున్నారు. సాక్షాత్తు కలెక్టర్ శ్రీమతి కూడా అక్కడే కాన్పు చేయించుకున్నారని.. ఆ ధైర్యంతోనే ఆ మహిళ కాన్పుకు వెళ్లింది. అయితే.. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం.. ఇతర కారణాలతో పురుట్లోనే ఆ బిడ్డ చనిపోయింది. దాంతో వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ తల్లి దుఖఃనికి అంతేలేదు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు సైతం దిగారు. నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయాలని.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.