కూలీలపై నాయకులు ఆగ్రహం
ఫీల్డ్ అసిస్టెంట్ ని నిలదీసిన ఉపాధి హామీ కూలీలు
మా డబ్బులు జమ కావడం లేదని ఆవేదన
నిడిముసలి గ్రామంలో కూలీల నిరసన
ఇష్టముంటే రాండి…లేకపోతే పోండి
- కూలీలపై నాయకులు ఆగ్రహం
- ఫీల్డ్ అసిస్టెంట్ ని నిలదీసిన ఉపాధి హామీ కూలీలు
- మా డబ్బులు జమ కావడం లేదని ఆవేదన
- నిడిముసలి గ్రామంలో కూలీల నిరసన
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కూలీలు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కూలీలు తమకు నగదు జమ కాలేదని… పనులు చేయిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ నిలదీసి…రోడ్డుపై నిరసన తెలియజేశారు. వారం రోజులు పనులు చేస్తే రెండు రోజులు మాత్రమే అమౌంట్ లో జమ అవుతున్నాయని…ఏమని అడిగితే సరైన సమాధానం కూడా చెప్పడం లేదని..మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానిక నాయకులు కూలీలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కూలీలు మాత్రం తమకు నగదు చెల్లిస్తేనే పనులు చేస్తామని తేల్చి చెప్పారు. వెంటనే నాయకులు జోక్యం చేసుకొని…పనికి ఇష్టం ఉంటే రాండి…లేకపోతే రావద్దని చెప్పడంతో కూలీలందరూ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రహదారిపై కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమకు ఇవ్వాల్సిన నగదు ఏమవుతుందని…అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే ప్రశాంతమ్మ, ఉన్నతాధికారులు స్పందించి…ఉపాధి హామీ పథకంలో జరిగే అవినీతిపై చర్యలు తీసుకోవడంతోపాటు తమకు న్యాయం చేయాలని కూలీలు వేడుకుంటున్నారు. వారి బాధని వారి మాటల్లోనే విందాం….