సంవత్సరం క్రితం ఇదే రోజున

హామీ మేరకు పెన్షన్ ఇవ్వడం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం

ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాల అమలు

నియోజకవర్గ ప్రజలకు అండగా సోమిరెడ్డి కుటుంబం

సంవత్సరం క్రితం ఇదే రోజున

  • హామీ మేరకు పెన్షన్ ఇవ్వడం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం
  • ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాల అమలు
  • నియోజకవర్గ ప్రజలకు అండగా సోమిరెడ్డి కుటుంబం

సంవత్సరం క్రితం ఇదే రోజున పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేయడం…. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేయడం జరిగిందని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని…..ఎమ్మార్వో ఆఫీస్ కాలనీ, బలిజ పాలెం గ్రామాలలో…. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సోమిరెడ్డి శృతిరెడ్డి తో కలిసి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరు విచ్చేసిన రాజగోపాల్ రెడ్డి…. శృతి రెడ్డిలకు టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. టిడిపి మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి రాజగోపాల్ రెడ్డి దంపతులు లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… పెన్షన్ పెంచడం మూడు నెలలు పెంచిన పెన్షన్ కలిపి ఇవ్వడం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు అనంతరం సోమిరెడ్డి శృతి రెడ్డి మాట్లాడుతూ… నాడు పేదల కోసం ఎన్టీఆర్ తీసుకువచ్చిన పెన్షన్ విధానాన్ని నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆలోచనతో పేదలకు అండదండగా పెన్షన్ అందజేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సోమిరెడ్డి కుటుంబం…. టిడిపి నాయకులు కూటమి ప్రభుత్వం అండగా ఉంటాయని చెప్పారు .ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు… మాజీ ఉపసర్పంచ్ సుంకర శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ ,ఎంపీడీవో నాగమణి ఈఓపిఆర్డి హేమంత్ కుమార్ పలువురు టిడిపి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *