మాసీలమణి హాస్పిటల్ లో డాక్టర్స్ డే దినోత్సవ వేడుకలు
వైద్య వృత్తిలో కొనసాగడం నా పూర్వజన్మ సుకృతం
- మాసీలమణి హాస్పిటల్ లో డాక్టర్స్ డే దినోత్సవ వేడుకలు
నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రంలోని స్థానిక మాసీలమణి హాస్పిటల్ ప్రాంగణంలో డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది మాసీలామణిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మాసీలామణి మాట్లాడుతూ… ఈ వైద్య వృత్తిలో కొనసాగడం నా పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో, ఆప్యాయంగా పలకరిస్తూ వైద్యం చేయడం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి, కొండారెడ్డి, జె వి, హాస్పిటల్ సిబ్బంది, రోగులు, తదితరులు పాల్గొన్నారు.