అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సీడీపీవో శంషాద్ బేగం
పిల్లలకు ఆటపాటలతో విద్యను బోధించాలి
- అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సీడీపీవో శంషాద్ బేగం
తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 9వ వార్డు టీచర్స్ కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని ప్రాజెక్టు అధికారి శంషాద్ బేగం అకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలోని పిల్లలు రిజిస్టర్ తనిఖీ చేశారు. పూర్వం ప్రాథమిక విద్య గురించి పిపి 1, పిపి 2 టెక్స్ట్ బుక్స్ లోనే పాఠ్యాంశాలపై పిల్లలతో మాట మంతి, సృజనాత్మక విద్య, ఆటపాటలతో అంగన్వాడి పిల్లలకు విద్య బోధించాలని ఆమె టీచర్స్ సూచించారు. ఈ సందర్భంగా శంషాద్ బేగం ఎన్ 3 న్యూస్ తో మాట్లాడుతూ… వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి అర్బన్ రూరల్, పరిధిలోని 261 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఫ్రీ స్కూల్ చిన్నారులను అంగన్వాడి కేంద్రాల నుండి 1152 మంది పిల్లలను ఫౌండేషన్ పాఠశాలల్లో చేర్చడం జరిగిందని తెలిపారు. అంగన్వాడీలలోని పిల్లలందరికి మంచి విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, సిబ్బంది పాల్గొన్నారు.