ఇరిగేషన్ లస్కర్ వినయ్ సేవలు ప్రశంసనీయం
సంగంలో ఘనంగా ఉద్యోగ విరమణ సభ
జీవితం సుఖ సంతోషాలతో సాగాలి…
- ఇరిగేషన్ లస్కర్ వినయ్ సేవలు ప్రశంసనీయం
- సంగంలో ఘనంగా ఉద్యోగ విరమణ సభ
నెల్లూరు జిల్లా సంగం ఇరిగేషన్ సెక్షన్లో లస్కర్ గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన శ్రీనివాసులుకి ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ ఏఈ వినయ్ ఆధ్వర్యంలో సిబ్బంది సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ డీఈ పెంచలయ్య , ఏఈ లు, టీడీపీ నాయకులు,సిబ్బంది,కుటుంబసభ్యులు పాల్గొని లస్కర్ శ్రీనివాసులు దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఇరిగేషన్ సెక్షన్లో లస్కర్ గా ఆయన చేసిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణ , వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి ,అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులురెడ్డి, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు ఉక్కాల శ్రీనివాసులు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.