గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు
ఘనంగా బొబ్బేపల్లి పుట్టినరోజు వేడుకలు
- గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ
- కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు
బొబ్బేపల్లి అంకయ్య నాయుడు పుట్టినరోజు వేడుకలు… టిడిపి నాయకుల పుట్టినరోజు వేడుకలు పేద గిరిజనులకు ఉపయోగపడాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి పిలుపుతో పేదలకు మనసేవ కార్యక్రమాలు చేయడం జరిగిందని టిడిపి నాయకులు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో టీడీపీ సీనియర్ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య నాయుడు పుట్టినరోజు వేడుకలు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొని అంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. స్థానిక సబ్స్టేషన్ గిరిజన కాలనీలో టిడిపి నాయకులు దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామంలోని 50 కుటుంబాలకు చెందిన గిరిజనులకు నేరుగా వారి నివాసాలకే వెళ్లి దుప్పట్లు అందజేశారు. సందర్భంగా టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ బొబ్బేపల్లి అంకయ్య నాయుడు మిత్రులు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు టిడిపి నాయకుల సౌజన్యంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా గిరిజనులకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టమని చెప్పారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్, సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు, కొత్తపల్లి మహేష్ పసుపులేటి ప్రసాద్ పల్లాల రవీంద్ర , మైపాటి రవికుమార్ ,శివ పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.