కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డులో పాఠశాల వద్ద ఘటన
ఎంత ప్రమాదం తప్పింది..?
- కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డులో పాఠశాల వద్ద ఘటన.
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తుమ్మలపెంట వైపు వెళుతున్న టిప్పర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన డ్రైవర్ వెళుతూ ఉన్న లారీని వదిలేసి కిందికి దూకేశాడు. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డు మార్జిన్ లో ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. దీంతో అక్కడ రోడ్డు మార్జిన్ లో వ్యాపారులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని వాహనంలో మంటలు చెలరేగకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. వాహనాలు, పాదచారుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం అందరినీ హడలెత్తించింది. చెట్టే లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.