ఘనంగా కలిగిరి తహసీల్దార్ చొప్పా రవీంద్రబాబు సన్మానం
రవీంద్రబాబు సేవలను కొనియాడిన వక్తలు
ఉద్యోగ సేవ- ఉద్యమ స్పృహ కలగలిసిన నేత చొప్పా
- ఘనంగా కలిగిరి తహసీల్దార్ చొప్పా రవీంద్రబాబు సన్మానం
- రవీంద్రబాబు సేవలను కొనియాడిన వక్తలు
నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మి నరసారెడ్డి పురమందిరంలో రెవిన్యూ ఉద్యోగుల నాయకులు, ఉద్యమ నేత, కలిగిరి తహశీల్దార్ చొప్పా రవీంద్రబాబు ఉద్యోగ విరమణ సత్కార సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ, పలువురు ముఖ్యులు విచ్చేశారు. ఉద్యోగ సేవ-ఉద్యమ స్పృహ కలగలిసిన నేత చొప్పా రవీంద్రబాబు అని ఆయన సేవల్ని వక్తలు కొనియాడారు. యువత ఇలాంటి నాయకుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పలువురు వక్తలు రవీంద్రబాబు విధానాలను, ఉద్యోగులకు చేసిన సేవలను ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించారు. చొప్పా రవీంద్రబాబు దంపతుల్ని కమిటీ అత్యంత ఘనంగా సత్కరించింది. ఇంత మంది ఉద్యోగుల, ఉద్యోగ నాయకుల అభిమానాన్ని చూరగొనడం తన అదృష్టమని రవీంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగ, సామాజిక సేవలు మరింత విస్తృత పరచుకుంటానని అంటూ, హాజరైన అశేష ఉద్యోగ వాహినికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాన్ని రిటైర్డ్ తహశీల్దార్ మనోహర రావు అధ్యక్షతన, ఐ కృష్ణయ్య కన్వీనర్ గా నిర్వహణ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో APRSA జిల్లా అధ్యక్ష కార్యదర్సులు పెంచల రెడ్డి, డేనియల్, APGEA జిల్లా అధ్యక్ష కార్యదర్సులు సుధాకర రెడ్డి, రాంప్రసాద్, APNGGO జిల్లా అధ్యక్షులు పెంచలరావు, జిల్లా వ్యాప్తంగా పలువురు తహశీల్దార్ లు, రెవెన్యూ సిబ్బంది, చొప్పా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పాల్గొన్నారు.