రానున్న నాలుగేళ్లలో సిద్ధం చేస్తాం
మూలాపేట బాలిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి నారాయణ
వీఆర్సీ స్కూల్ తరహాలో 54 ప్రభుత్వ పాఠశాలలు
- రానున్న నాలుగేళ్లలో సిద్ధం చేస్తాం
- మూలాపేట బాలిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి నారాయణ
వీఆర్ హైస్కూల్ తరహాలో…నగరంలోని 54 పాఠశాలలను సిద్ధం చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్నటువంటి బాలిక ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులను ఆయన అధికారులు, టీడీపీ నేతలతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, తరగతి గదులు, పిల్లల సంఖ్య పై అడిగి వివరాలు తీసుకున్నారు.. ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు.. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.. వచ్చే నెల 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మూలాపేట ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఘనమైన చరిత్ర కలిగినటువంటి వీఆర్సీ పాఠశాలను గత వైసిపి ప్రభుత్వం మూసేసిందని మండిపడ్డారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ తో పాటు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, 40 డివిజన్ ప్రెసిడెంట్ గండవరం నాని , వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజేశ్వరి.. టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.