అనుమతులను అతిక్రమిస్తే నిర్మాణాలను తొలగిస్తాం
కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరిక
వెంకట రామాపురంలో రెండు భవనాల కూల్చివేత
యజమానుల సమక్షంలోనే డెమోలిషన్
- అనుమతులను అతిక్రమిస్తే నిర్మాణాలను తొలగిస్తాం
- కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరిక
- వెంకట రామాపురంలో రెండు భవనాల కూల్చివేత
నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన స్థానిక 45వ డివిజన్ వెంకట రామాపురంలో రెండు భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సమక్షంలో యజమానులు సోమవారం స్వయంగా తొలగించారు. అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనధికార నిర్మాణాల తొలగింపుకు గతంలోనే నోటీసులు జారీ చేసి డెమోలిషన్ ఆర్డర్స్ ను కూడా యజమానులకు అందజేశామని కమిషనర్ తెలిపారు. కొంత గడువు కోరి స్వయంగా అనధికార నిర్మాణాలని తొలగించుకుంటామని కోరినందున టౌన్ ప్లానింగ్ విభాగం సమక్షంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.