చంద్రబాబు ఆశయాలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు..
టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆవేదన
చర్యలు తీసుకోవాలని కావలి ఆర్డీవోకు వినతి
దివ్వాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఏదీ…?
- చంద్రబాబు ఆశయాలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు..
- టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆవేదన
- చర్యలు తీసుకోవాలని కావలి ఆర్డీవోకు వినతి
దివ్వాంగులకు రేషన్ సరుకులు డీలర్లు డోర్ డెలివరీ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయానికి అధికారులు గండి కొడుతున్నారని టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఆయన ఎన్ త్రీ న్యూస్ తో మాట్లాడారు. దివ్వాంగులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ 2 నెలలగా చూస్తున్నా అమలు చేయడం లేదన్నారు. కావలి పట్టణం, మండలంలో పలు ప్రస్తాల్లో తాను పరిశీలన చేయడం జరిగిందన్నారు. ఇలా అధికారులు, డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల్లో మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలని కావలి ఆర్డీఓ వంశీ కృష్ణ కు వినతిపత్రం అందించామన్నారు.