పడుగుపాడు వద్ద ఘటన
గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి..
- పడుగుపాడు వద్ద ఘటన
గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందిన సంఘటన పడుగుపాడు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు..16వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని 45 సం కలిగిన ఓ వ్యక్తి మృతి చెందాడు.. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మతిస్థిమితం సరిగా లేక ఇక్కడే చెత్త వేరుకుంటూ ఉండేవాడన్నారు. సోమవారం తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా విజయవాడ నుండి గూడూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యాచకుడు మృతి చెందాడు..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…ఎస్ఐ రంగనాధ్ గౌడ్ మీడియాతో మాట్లాడి వివరాలు తెలియజేశారు.