పేదలకు అన్నదానం చేసిన నియోజకవర్గ జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్
ఆత్మకూరులో పేదలకు అన్నదానం
- పేదలకు అన్నదానం చేసిన నియోజకవర్గ జనసేన నేత చదలవాడ హరీష్ కుమార్
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రం వద్ద నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చలివేంద్రం ఏర్పాటు చేసి 64 రోజులై నేటితో ముగిస్తున్న సందర్భంగా ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో చలివేంద్రం,అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిరంజీవి యువత ఆత్మకూరు నియోజకవర్గం అధ్యక్షులు దాడి భాను కిరణ్, జనసేన నాయకులు పసుపులేటి శ్రీరామ్, సయ్యద్ అక్బర్ బాషా, పులిపాటి అనిల్, పవన్ కుమార్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు