ఇబ్బందులు పడ్డ వాహనదారులు
రహదారిపై ఇసుక…
- ఇబ్బందులు పడ్డ వాహనదారులు
నెల్లూరు జిల్లా సంగంలోని పలు ప్రాంతాల్లో ఇసుక వాహనాలతో రహదారిపై ఇసుక చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారుల ఇబ్బందులు తెలుసుకున్న ఎస్ఐ రాజేష్ పెన్నానది, జాతీయ రహదారి వద్ద రహదారిపై చేరిన ఇసుకను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. డోజర్ సహాయంతో ఇసుక తొలగించి వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.