జిల్లా యాదవ్ భవన్‌లో ఆత్మీయ సమావేశం – నెల్లూరు బార్ కార్యవర్గ ఎన్నికల్లో గెలుపొందిన యాదవ లాయర్లకు ఘనంగా సత్కారం – జనరల్ సెక్రటరీగా ఎన్నికైన నక్కల నాగరాజు, కౌన్సిల్ మెంబర్స్‌గా పుట్టుబోయిన వెంకటేశ్వర్లు, చేవూరు శ్రీధర్
నెల్లూరు జిల్లా.. యాదవ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. నెల్లూరు బార్ కార్యవర్గ ఎన్నికల్లో గెలుపొందిన యాదవ లాయర్లకు స్థానిక కొండాయపాళెం గొలగమూడి రోడ్డులోని జిల్లా యాదవ్ భవన్‌లో ఆత్మీయ సమావేశం జరిగింది. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఎన్నికైన నక్కల నాగరాజు, కౌన్సిల్ మెంబర్స్‌గా పుట్టుబోయిన వెంకటేశ్వర్లు, చేవూరు శ్రీధర్‌లను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆ సంఘ నాయకులు, పెద్దలు బొమ్మి కిషోర్ యాదవ్, ఎన్. నాగరాజు యాదవ్, దేవరాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.