నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు

మంగళగిరిలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు పాల్గొన్నారు. ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అంతా కలిసి పని చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింకను నెల్లూరు జిల్లా కావలి భక్తులు గుర్తించారు. లడ్డూలో బొద్దింక ప్రత్యక్ష మవడంతో భక్తులు ఆవేదనకు గురయ్యారు. ఆలయ ఈవోకి ఫిర్యాదు చేశారు. సిబ్బందిపైన ఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరులోని సర్వోదయ కళాశాల ప్రాంగణంలో 108 కండముల గాయత్రీ మ‌హాయ‌జ్ఞం వైభవంగా జరిగింది. య‌జ్ఞంలో పెద్ద సంఖ్యలో దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు.

పేద, మెరిట్ విద్యార్థులకి ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ వంకి పెంచలయ్య శుభవార్త చెప్పారు. ఇంటర్లో 980కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకి ఉచితంగా సీట్లు ఇస్తామని ప్రకటించారు. గూడూరులోని ఆదిశంకర కాలేజీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాణి కుమార్తె కాకాణి పూజిత మండల స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా తాము ఉన్నామని ఆమె భరోసా ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం మోసాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల్ని ప్రజల్లోకి తీసుకెళుదామని వైసీసీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గస్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తి నింపేందుకే జులై 11,12,13 తేదీలలో రెవెన్యూ స్పోర్ట్స్ ని నిర్వహిస్తున్నామని ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్య‌క్షులు అల్లంపాటి పెంచ‌ల‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక చేపట్టారు.

బారాషహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను జనసేన నగరాధ్యక్షుడు సుజయ్ బాబు జనసైనికులతో కలసి పరిశీలించారు. మత సామరస్యానికి ప్రతీక బారాషహీద్ దర్గా అని ఆయన చెప్పారు.

సూళ్లూరుపేటలో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. హరే రామ…హరే రేకృష్ణ భక్తుల భజనలతో పట్టణం మారుమోగిపోయింది.

కలువాయిలోని అంకమ్మ తల్లి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగలుగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొట్టు ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ లారీ చక్రాల కింద పడి నుజ్జు నుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు

ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై ఒక్క సారిగా మంటలు వ్యాపించిన ఘటన సూళ్లూరుపేటలో చోటు చేసుకుంది. నాయుడుపేట ఫైర్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *