ప్రజలంతా అమ్మవారి కృపాకటాక్షాలతో సుఖ సంతోషాలతో వర్థిల్లాలి -బెజవాడ కనకదుర్గమ్మ మొక్కులు తీర్చుకున్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి -ఆలయ మర్యాదలతో వేమిరెడ్డికి ఘనస్వాగతం
కనక దుర్గమ్మ కరుణించమ్మా..!
ప్రజలంతా అమ్మవారి కృపాకటాక్షాలతో సుఖ సంతోషాలతో వర్థిల్లాలి
-బెజవాడ కనకదుర్గమ్మ మొక్కులు తీర్చుకున్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి
-ఆలయ మర్యాదలతో వేమిరెడ్డికి ఘనస్వాగతం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రి లో వెలసియున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని ఆదివారం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు వేమిరెడ్డికి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ ఘనస్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.. అనంతరం విజయ భాస్కర్ రెడ్డి దుర్గమ్మకు నివేదనలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అమ్మవారి కృపాకటాక్షాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేమిరెడ్డి ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు వేమిరెడ్డికి శాలువాతో సత్కరించి వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాద వినియోగాలను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి ముఖ్య నేతలు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.