కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేతలు డిమాండ్
ఇల్లందులో సీపీఐ 18వ మహాసభలు…
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేతలు డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కమ్యూనిటీ హాల్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబీర్ భాష ఆధ్వర్యంలో 18వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా షబీర్ భాష మాట్లాడుతూ… అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లులు లేని వారికి ఇల్లు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పింఛన్లు ఇప్పించేందుకు పార్టీ శ్రేణులందరూ కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొంత మేరకు అమలు చేయాల్సి ఉందని అన్నారు. అలాగే ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం 25 వేల ఎకరాలకు సాగునీరు అందించేలాగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.