ఇండో సోలార్ కంపెనీకి భూములివ్వం

నేషనల్ హైవే ను దిగ్బంధం చేసిన కరేడు గ్రామ రైతులు -బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపుతో కదం తొక్కిన కరేడు గ్రామ రైతులు -ముంద‌స్తు అరెస్టులు, స్టేష‌న్ల‌కు త‌ర‌లింపు -రామచంద్ర యాద‌వ్‌ను అడ్డుకునేందుకు పోలీసుల విఫ‌ల‌య‌త్నం -స‌ముద్ర మార్గంలో ఉద్య‌మంలో పాల్గొన్న రామ‌చంద్ర యాద‌వ్‌

ఇండో సోలార్ కంపెనీకి భూములివ్వొద్దు..!
-నేషనల్ హైవే ను దిగ్బంధం చేసిన కరేడు గ్రామ రైతులు
బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపుతో కదం తొక్కిన కరేడు గ్రామ రైతులు
ముంద‌స్తు అరెస్టులు, స్టేష‌న్ల‌కు త‌ర‌లింపు
రామచంద్ర యాద‌వ్‌ను అడ్డుకునేందుకు పోలీసుల విఫ‌ల‌య‌త్నం

స‌ముద్ర మార్గంలో ఉద్య‌మంలో పాల్గొన్న రామ‌చంద్ర యాద‌వ్‌

ఇండో సోలార్ కంపెనీకి 4500 ఎక‌రాల భూమిని అప్ప‌గిస్తూ.. ప్ర‌భుత్వం రైతుల‌కు నోటీసులు జారీ చేయ‌డంతో క‌రేడు రైతులు ఆగ్ర‌హించారు. వీరికి మ‌ద్ద‌తుగా బీసీవై పార్టీ అధినేత బోడే రామ‌చంద్ర యాద‌వ్ హైవే దిగ్భంధానికి పిలుపునిచ్చారు. దాంతో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గం.. ఉల‌వ‌పాడు మండ‌లం క‌రేడు ర్యాంపు వ‌ద్ద పెద్ద ఎత్తున రైతులు జాతీయ‌ర‌హ‌దారి దిగ్బంధం చేశారు. ఈవిష‌యం తెలుసుకున్న పోలీసులు రైతు సంఘాల నాయ‌కుల‌ను ముంద‌స్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేసి.. కందుకూరు, ఉల‌వ‌పాడు స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. అయినా.. వేలాది మంది కరేడు గ్రామం నుండి నేషనల్ హైవే వరకు ర్యాలీ నిర్వహించి నేషనల్ హైవేను దిగ్బంధం చేశారు. రామచంద్ర యాదవ్ ను కరేడు గ్రామానికి రాకుండా పోలీసులు ఎంత ప్రయత్నించినా, సముద్ర మార్గం నుండి కరేడు గ్రామానికి రామచంద్ర యాదవ్ చేరుకుని రైతులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అరగంట సేపు హైవే ను దిగ్బంధం చేసిన అనంతరం, సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఉన్నతాదికారులతో మాట్లాడి.. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్ట్ రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో ఉద్యమాన్ని విరమించారు. అనంతరం రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కందుకూరు సబ్ కలెక్టర్ హామీతో తాత్కాలికంగా ఉద్యమం విరమించామని, హామీని అమలు చేయకపోతే మా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామ‌ని ఈసంద‌ర్భంగా హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *