వైభవంగా ప్రారంభమైన అంకాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు
అంకాలమ్మ సన్నిధిలో విజయాడ పోలీసు కమిషనర్
- వైభవంగా ప్రారంభమైన అంకాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అంకాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘనంగా ప్రారంభించారు. అమ్మవారి జాతరనీ పురస్కరించుకొని ముఖ్య అతిధిగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు పాల్గొని, అమ్మవారినీ దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు కమిషనర్ కు ఘన స్వాగతం పలికారు. కమిషనర్ మాట్లాడుతూ… కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అంకాలమ్మ జాతర ఇక్కడ చేయడం మంచి శుభ పరిణామం అన్నారు. జాతరగా వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకొని అమ్మవారు కృపకు పాత్రులు కాగలరని ఆయన అభిప్రాయపడ్డారు.