రూ. 5వేల నగదు అపహరణ
అంకమ్మ ఆలయంలో హుండీ చోరీ…
- రూ. 5వేల నగదు అపహరణ
నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రం సుసర్లవీధిలో వెలసియున్న గ్రామ దేవత అంకమ్మ దేవస్థానంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.. అమ్మవారి గుడి ఇనుప గేటు తాళం పగుల గొట్టి హుండీలో ఉన్నటువంటి నగదును తీసుకుని హుండీని గుడి సమీపంలోని గడ్డివాములలో వదిలి వెళ్లారు..గుడి తాళాలు పగలగొట్టి ఉండటం చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు.. స్థానికులు సమాచారం మేరకు హుండీలో 5000/- రూపాయలు వరకు నగదు ఉండవచ్చఅని తెలుపుతున్నారు..