రోడ్ల శుభ్రతను మెరుగుపర్చేందుకు స్వీపింగ్ మిషన్లు
ఇక ప్రధాన రోడ్లన్నీ స్వీపింగ్ మిషన్లతోనే క్లీనింగ్
మ్యాన్యువల్ క్లీనింగ్‌కు స్వస్తి
స్వీపింగ్ మిషన్‌ను ప్రారంభించి.. స్వయంగా నడిపిన మంత్రి నారాయణ
49 రోజుల్లో దుమ్ము లేకుండా చేస్తా..!
రోడ్ల శుభ్రతను మెరుగుపర్చేందుకు స్వీపింగ్ మిషన్లు
ఇక ప్రధాన రోడ్లన్నీ స్వీపింగ్ మిషన్లతోనే క్లీనింగ్
మ్యాన్యువల్ క్లీనింగ్‌కు స్వస్తి
స్వీపింగ్ మిషన్‌ను ప్రారంభించి.. స్వయంగా నడిపిన మంత్రి నారాయణ
నెల్లూరు నగరంను పరిశుభ్రంగా ఉంచేందుకు.. రానున్న 49 రోజుల్లో దుమ్ము లేకుండా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. ప్రధాన రహదారుల్లో ఇక మ్యానువల్ క్లీనింగ్ కాకుండా.. స్వీపింగ్ యంత్రాల ద్వారా పరిశుభ్రం చేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే నెల్లూరు కార్పోరేషన్‌కు 28 స్వీపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిందన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారంం నెల్లూరు సిటీలోని 7వ డివిజన్ స్టోన్ హౌస్‌పేటలో ఆయన స్వీపింగ్ భారీ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ ఆ వాహనాన్ని స్వయంగా నడిపి.. కొంత దూరం రోడ్డును శుభ్రం చేశారు. అనంతరం అక్కడి బీవీఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులను తనిఖీ చేశారు. అక్కడి ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడారు. సమస్యలేమైనా ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అదనపు గదుల నిర్మణానికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. క్లీనింగ్ మిషన్ల ద్వారా 49 రోజుల్లో నెల్లూరులో దుమ్ము లేకుండా చేస్తాం అన్నారు. అవసరాన్ని బట్టి.. విడతలవారీగా.. స్వీపింగ్ మిషన్ల సంఖ్యను పెచుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ స్వీపింగ్ మిషన్లను అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. విద్యా వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, ఏడవ డివిజన్ కార్పోరేటర్ కిన్నెర మాల్యాద్రి, తాళ్ళపాక అనురాధ, జనసేన నాయకులు నూనె మల్లిఖార్జున యాదవ్, కొండా ప్రవీణ్, వైరవి, తదితరులు పాల్గొన్నారు.