గ్యాస్ గోడన్ ధ్వంసం
బోడిలింగాలపాడులో ఘటన
312 సిలిండర్లు చోరీ…
- గ్యాస్ గోడన్ ధ్వంసం
- బోడిలింగాలపాడులో ఘటన
తిరుపతి జిల్లా తడ మండలం బోడిలింగాలపాడు వద్ద హెచ్.పీ గ్యాస్ గోడౌన్ లో గ్యాస్ సిలిండర్లు చోరీ జరిగింది. గ్యాస్ గోడౌన్ లో 19 కేజీల సిలిండర్లు 33, 5 కేజీల సిలిండర్లు 65, 14 కేజీల సిలిండర్లు మొత్తం 312 సిలిండర్లు చోరీకి గురి అయ్యాయని హెచ్.పీ గ్యాస్ సిలిండర్ యాజమాన్యం తెలియజేశారు. రాత్రి 2:00 సమయంలో సీసీటీవీ లకు ఎదురుగా రేకులను అమర్చి బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేసి సిలిండర్లు ఎత్తుకొని వెళ్ళిపోయారని తెలిపారు. ఒక దళిత మహిళనని నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చోరీ విషయమై పోలీసుకు తెలియజేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.