దుకాణదారులకి పోలీసుల వార్నింగ్
మందలపల్లిలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డుని ఆక్రమిస్తే…చర్యలు తప్పవు
- దుకాణదారులకి పోలీసుల వార్నింగ్
- మందలపల్లిలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి ప్రధాన సెంటర్ వద్ద దమ్మపేట,అశ్వరావుపేట పోలీసులు కలిసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ప్రధాన సెంటర్ వద్ద దుకాణ యజమానుదారులు ఆర్ అండ్ బి రోడ్డు భాగం మీదకు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. మందలపల్లి ప్రధాన జాతి రహదారిపై జరిగే ప్రమాదాలను హరికట్టాలని లక్ష్యంతో దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. రోడ్డు విశాలంగా ఉంటే ఏ వైపు వెళ్లాల్సిన వాహనాలు అదే వైపు సురక్షితంగా ప్రయాణిస్తాయన్నారు. ప్రతి రోజు పరిశీలిస్తానని… ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. యువకులతో ఆయన ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని చూపించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట దమ్మపేట పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.