రూరల్ కు ఎంతచేసినా తక్కువే..

కూటమిలోనే నెరవేరబోతున్న దశాబ్ధాల కల

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

కొమ్మరపూడిలో రూ. 80 లక్షలతో రోడ్డుకు శంఖుస్థాపన

రూరల్ కు ఎంతచేసినా తక్కువే…

  • కూటమిలోనే నెరవేరబోతున్న దశాబ్ధాల కల
  • రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • కొమ్మరపూడిలో రూ. 80 లక్షలతో రోడ్డుకు శంఖుస్థాపన

ఆగస్టు కల్లా నెల్లూరు రూరల్ లో ప్రతి గ్రామానికి నాణ్యమైన 3 ఫేస్ 24 గంటలూ అందిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొమ్మరపూడి ప్రధాన రహదారి నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. వీరికి స్థాకి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూ. 80 లక్షలతో గ్రామ ప్రధాన రహదారికి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 45 రోజుల్లో కొమ్మరపూడి మెయిన్ రోడ్డు పూర్తిచేసి, గ్రామ ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *