సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
విక్రమ సింహపురి యూనివర్శిటీలో మెగా జాబ్ మేళా
మళ్లీ యువతకి ఉద్యోగాలు…
- సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- విక్రమ సింహపురి యూనివర్శిటీలో మెగా జాబ్ మేళా
సర్వేపల్లిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించడమే సోమిరెడ్డి ఫౌండేషన్ లక్ష్యమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోమిరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆయన వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సునిత, కంపెనీ ప్రతినిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ప్రముఖ కంపెనీలు విచ్చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లక్ష్యమని, ఆదిశగా పథకాలు అమలు చేస్తున్నారని అయన తెలిపారు. విక్రమ సింహాపురి యూనివర్శిటీలో మెగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషం ఉందన్నారు. మొత్తం 34 కంపెనీలు వచ్చాయి.. 1200 మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ ప్రొఫెసర్లు, కంపెనీల ప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.