సంగంలో మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం
మత్తుకు బానిసలవ్వద్దు…
- సంగంలో మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం
నెల్లూరు జిల్లా సంగంలో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా… పోలీస్ స్టేషన్ నుండి జాతీయ రహదారి వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు… జీవితమే ముద్దు అంటూ నినాదాలు చేసి..మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ… యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్ మదరబాషా ,విద్యార్థులు పాల్గొన్నారు.