కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం , మంత్రి పొంగూరు నారాయణ
ప్రతి రోజూ 1400 మెట్రిక్ టన్స్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి
-కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం
మంత్రి పొంగూరు నారాయణ
ఎడ్లపాడు మండలం, కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్లాంట్ లో వ్యర్థాలను వేరు చేయడం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. విజయవాడ, గుంటూరుతో పాటు మొత్తం 12 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రతిరోజూ 1,400 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ ,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .