పెద్దమ్మగారిపల్లిలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
ప్రజలకు మంచినీరు అందించడలే లక్ష్యం…
- పెద్దమ్మగారిపల్లిలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కే.వడ్డేపల్లి పంచాయతీ పెద్దమ్మగారిపల్లిలో ఆర్.ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. ఎమ్మెల్యేకి నాయకులు, మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, ప్రజలతో కలసి వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….వడ్డేపల్లి పంచాయతీలోని ప్రజలకు మంచి నీరు అందించాలని దృడ సంకల్పంతో వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాకాల జడ్పిటిసి నంగా పద్మజాబాబు రెడ్డి, టిడిపి మండలాధ్యక్షుడు నాగరాజు నాయుడు, సీనియర్ నాయకులు నంగా బాబు రెడ్డి,వైస్ ఎంపీపీ చెన్నకేశవ రెడ్డి, బొల్లినేని మహేష్ కుమార్,టిడిపి చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి,సర్పంచ్ వరలక్ష్మి, ఎంపీడీఓ శశిరేఖ, ఏ.ఓ రవిచంద్ర, వివిధ శాఖల అధికారులు,సచివాలయ సిబ్బంది,టిడిపి నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.