మంత్రి నారాయణ హామీ
11వ డివిజన్లో పార్కుని ప్రారంభించిన మంత్రి
ప్రజలకిచ్చిన ప్రతీ హామీనీ నెరవేరుస్తాం…
- మంత్రి నారాయణ హామీ
- 11వ డివిజన్లో పార్కుని ప్రారంభించిన మంత్రి
నెల్లూరు నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 11వ డివిజన్ ఎన్టిఆర్ నగర్లో రూ.50 లక్షలతో ఆధునీకరించిన చెరుకుతోట పార్కును చిన్నారుల కేరింతలు, ఆనందోత్సహాల మధ్య మంత్రి ప్రారంభించారు. పిల్లలకు చాక్లెట్లు పంచి పార్కులో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సిటీలో 50 పార్కులు ఆధునీకరిస్తున్నామని, ఇప్పటికే 30 పార్కులు ప్రారంభించామన్నారు. త్వరలోనే మిగిలిన పార్కులను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని, నెల్లూరుని దోమల రహిత నగరంగా చేస్తామని చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీ క్రమం తప్పకుండా నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ ,డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్, కార్పొరేషన్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.