కావలి ఎంఈవో- 2 వెంకట సుబ్బయ్య హెచ్చరికలు
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ప్రతి విద్యార్థికి చేరాలని సూచన
పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు…
- కావలి ఎంఈవో- 2 వెంకట సుబ్బయ్య హెచ్చరికలు
- సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ ప్రతి విద్యార్థికి చేరాలని సూచన
కావలి పట్టణం మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి ఎంఈవో- 2 వెంకట సుబ్బయ్య హెచ్చరించారు. శుక్రవారం కావలి పట్టణం ప్రభుత్వ బుక్స్ పాయింట్ వద్ద ఆయన ఎన్ త్రీ న్యూస్ తో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అన్నీ పాఠశాలల్లో తనిఖీలు చేస్తామని తెలిపారు. గత ఏడాది కంటే ప్రభుత్వ పాఠశాలలకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ లో యూనిఫాం, షూస్, పాఠ్య పుస్తకాలు ఎంతో నాణ్యతతో ఉన్నట్లు తెలిపారు. ఒకటి, రెండు తరగతులకు బ్యాగులు రావాల్సిందని, ఇప్పటికే కావలి మండలంలోని 120 పాఠశాలల్లో సుమారు 11 వేల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ అందించడం జరిగిందన్నారు.