ప్రారంభానికి సిద్దమైన వీఆర్సీని పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె షరణి
స్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులతో చర్చ
నాన్నగారి కల నెరవేరబోతోంది…
- ప్రారంభానికి సిద్దమైన వీఆర్సీని పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె షరణి
- స్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులతో చర్చ
నాన్న పొంగూరు నారాయణ సంకల్పానికి అనుగుణంగా వీఆర్సీ రూపుదిద్దుకుందని…మంత్రి కుమార్తె పొంగూరు షరణి తెలిపారు. ప్రారంభానికి సిద్ధమైన వీఆర్ హైస్కూల్ ని ఆమె పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో షరణి చర్చలు జరిపారు. డిజిటల్ విద్యాబోధనపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మీడియాతో మాట్లాడారు. వీఆర్సీలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించబోతున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తరగతి గదులు ,క్రీడా మైదానం సిద్ధం చేశామన్నారు. పేదపిల్లల కోసం మొట్టమొదటి సారి డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈనెల 30 వ తేదీ నుంచి తరగతులు మొదలౌతాయని అన్నారు.