హెడ్మాస్టర్ కి కంప్యూటర్ అందచేసిన వేమా
జడ్పీ హైస్కూల్ కి కంప్యూటర్ బహుకరణ…
- హెడ్మాస్టర్ కి కంప్యూటర్ అందచేసిన వేమా
నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హై స్కూల్ కి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు దాత వేమా మల్లికార్జున రావు, ఆయన కుమారుడు వేమా విక్రమ్ కంప్యూటర్ ను బహుకరించారు. హెడ్మాస్టర్ బుజ్జయ్య వినతి మేరకు వారు స్పందించి సుమారు 50 వేల రూపాయల విలువ గల కంప్యూటర్ ను హెడ్మాస్టర్ బుజ్జయ్య కు అందించారు. దాతలకు పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా హెడ్మాస్టర్ బుజ్జయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు దాతలు కంప్యూటర్ ను బహుకరించడం అభినందనీయమని అన్నారు.పాఠశాల కి సంబంధించిన డేటా ఆన్లైన్ చేయడంలో కంప్యూటర్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దాత వ్యమా మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాఠశాల పూర్వ విద్యార్థినై పాఠశాల అభివృద్ధికి సహకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంచికలపాటి మోహన్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.