అంతా బహిరంగ ప్రదేశాలలోనే
అక్కడ…ATM మద్యం
- అంతా బహిరంగ ప్రదేశాలలోనే
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఇప్పుడు ఎనీ టైం మద్యం అందుబాటులో ఉంటుంది. దీని కోసం మద్యం షాపుల వారు ATM లాంటి కౌంటర్లు నడిపిస్తున్నారు. మద్యం షాపుల ముందే కూలింగ్ బాక్స్ లు పెట్టి మరీ మద్యం అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరవాలని… తిరిగి రాత్రి 10 గంటలకు మద్యం షాపులు మూసి వేయాలి. రాత్రి 10 గంటల తరువాత నుండి ఉదయం 10 గంటల వరకు ఎక్కడా మద్యం అమ్మకాలు జరగకూడదు ఇది ప్రభుత్వ నిబంధన. కానీ ఇక్కడ మాత్రం నిత్యం మద్యం మందుబాబులకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు వైన్ షాపుల ముందు, పక్కన, వెనకాల ఇలా ఎక్కడ బడితే అక్కడ బహిరంగంగానే మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అధికారులకు తెలిసే జరుగుతున్నా ఈ తంతును ఎవరు నియంత్రిస్తారో చూడాల మరి…