రక్తదానం చేసిన 100మంది యువత
రెడ్‌క్రాస్‌లో ఘనంగా పీసీఆర్ జన్మదిన వేడుకలు
-రక్తదానం చేసిన 100మంది యువత
ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ యువనాయకులు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్‌లో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. నగరంలోని సుమారు 100 యువత రక్తదానం చేశారు. తమ అభిమాన నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని.. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉండాలని ఈసందర్భంగా రాజ్‌కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్షు, హుస్సేన్, రాహుల్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.