డీఎస్పీ పార్ధసారధి – కుప్పంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
మాదక ద్రవ్యాలను వాడకండి
- డీఎస్పీ పార్ధసారధి
- కుప్పంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
మాదకద్రవ్యాలను వాడవద్దని అదే విధంగా ఇల్లీగల్ పనులను చేయకండి అని కుప్పం డీఎస్పీ పార్థసారథి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు విద్యార్థులు, ప్రజలతో కలసి పోలీసులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. చెడు వ్యసనాలకు బానిసై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్నారు. మాదకద్రవ్య వినియోగ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. జీవితంలో డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సీఐ, రూలర్ సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..