ర్యాలీని ప్రారంభించిన డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ సుజాత
నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
- ర్యాలీని ప్రారంభించిన డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ సుజాత
నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభించిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుజాత ప్రారంభించారు. అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఖావలి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డాక్టర్ సుజాత పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఏపీసీయు ప్రతినిధి శివ, నవజీవన్ సంస్థ ప్రతినిధులు ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.