ఘనంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి జన్మదిన వేడుకలు
53 కేజీల భారీ క్రేన్ కేక్, బాణాసంచా, ఆకట్టుకున్న సంప్రదాయనృత్యాలు
చీదెళ్ల కిషన్ ఆధ్వర్యంలో అంబరాన్ని సంబరాలు
ఘనంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి జన్మదిన వేడుకలు
- 53 కేజీల భారీ క్రేన్ కేక్, బాణాసంచా, ఆకట్టుకున్న సంప్రదాయనృత్యాలు
నెల్లూరులో ఎమ్మెల్సీ, వైసీపీ సిటీ ఇన్‌ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జన్మదిన వేడుకలను.. రాంజీ నగర్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్, చంద్రశేఖర్‌రెడ్డి అభిమానులు ఉదయ్, జైన్ సన్నీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు. బ్యాండు మేళాలు, చిన్నారుల సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు, స్పార్క్ లైటింగ్‌తోపాటు చంద్రశేఖర్‌రెడ్డి భారీ కటౌట్ ఏర్పాటుచేసి.. లైటింగ్, స్పార్క్ లైట్లతో సంబురాలు జరుపుకున్నారు. అలాగే.. భారీ కేక్‌ను క్రేన్‌తో తెచ్చి.. చంద్రశేఖర్రెడ్డిచే కట్ చేయించి.. అందరికీ పంచిపెట్టారు. గజమాలలతో.. శాలువాతో ఆయన్ను సత్కరించి.. జన్మదిన శుభాకాంక్షులు తెలియజేశారు. అలాగే.. డీజే సాంగ్స్‌కు పార్టీ నాయకులు, యువకులు, మహిళలు డ్యాన్సులు చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో.. చీదెళ్ల కిషన్‌తోపాటు చంద్రశేఖర్‌రెడ్డి అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.