జూలూరుపాడు తహసీల్దారు కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
-జూలూరుపాడు తహసీల్దారు కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు గుండుపిన్ని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సండ్ర నరేంద్ర మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, కొందరు నిరుపేదలను స్థానికంగా ఉన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులే అనర్హులు చేశారని ఆరోపించారు. సమగ్ర సర్వే చేసి.. పేదలైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ తరఫున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానికులు పాల్గొన్నారు.