రెండు నెలల్లోనే అర్హులైన అందరికీ రేషన్, ఆధార్ కార్డులు

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి_ _జిల్లాలో బాల్యవివాహాలను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు – కలెక్టర్ ఓ. ఆనంద్_ _నెల్లూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి_

రెండు నెలల్లోనే అర్హులైన అందరికీ రేషన్, ఆధార్ కార్డులు

  • రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
  • జిల్లాలో బాల్యవివాహాలను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు – కలెక్టర్ ఓ. ఆనంద్
  • నెల్లూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి


రానున్న రెండు నెలల్లో అర్హులైన అందరికీ రేషన్, ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని… రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఆమె కలెక్టర్, ఎమ్మెల్యే, పలువురు అధికారులతో సమీక్షించారు.


జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు విధిగా పౌష్టిక ఆహారం అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో గిరిజన సంక్షేమ శాఖ , స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన అందరికీ రానున్న రెండు నెలల కాలంలో రేషన్, ఆధార్ కార్డులు అందజేసి వారికి ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అవసరమైన చోట బోరింగ్లు వేసి మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ… జిల్లాలో గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉందని వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ…జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు నిరోధానికి అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని అని అన్నారు. మంత్రి జిల్లా కలెక్టర్ తో కలిసి గిరిజన సంక్షేమ విద్యార్థులకు కాస్కోటెక్ కిట్లను అందజేశారు. అంగన్వాడి సిబ్బందికి అవసరమైన స్టడీ మెటీరియల్ సామాగ్రిని పంపిణీ చేశారు. పలువురు అర్జీ దారుల నుండి సమస్యల పరిష్కారానికి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేశారు. కలెక్టర్ తో కలిసి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చెంచమ్మ ను మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీడీ మల్లికార్జున రెడ్డి, ఐ సి డి ఎస్ పి డి హీన సుజన, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *