కాకాణి పూజిత_ _పొదలకూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కాకాణి
మా నాన్న తప్పు చేయడు..
- కాకాణి పూజిత
- పొదలకూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కాకాణి
మా నాన్న ఏ తప్పు చేయలేదని…తప్పు చేసే వ్యక్తి కాదని మాజీ మంత్రి కాకాణి కుమార్తె కాకాణి పూజత తెలిపారు. పొదలకూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశ్నిస్తున్నారని మా నాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ లో పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత రెడ్డి ఆరోపించారు.. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు..సంఘం రోడ్డు కూడలిలో ఉన్న కాకాణి రమణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… మూడు నెలలుగా సర్వేపల్లీ నియోజకవర్గ ప్రజలకు మా నాన్న దూరంగా ఉన్న పార్టీ కేడర్ భయపడకుండా అండగా నిలుస్తున్నారన్నారు.. మా నాన్న ఎలాంటి తప్పులు చేయలేదని, తప్పు చేసే వ్యక్తి కాదని…మీరు అక్రమ కేసులు పెట్టాలంటే మా మీద పెట్టండి కానీ మాకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు, మా అభిమానులు మీద కేసులు పెడితే వారి పక్షాణ ఎంత దూరం అయిన వెళ్తామన్నారు..వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే, అధికారం శాస్వితం కాదని రేపు అనేది ఒక్కటి ఉంటుందని గుర్తు పెట్టుకోవలన్నారు..ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.