పోలీస్‌..ప్రెస్ స్టిక్క‌ర్ క‌నిపిస్తే కేసులే..!

పోలీసు పిల్ల‌లు, బంధువులు, కుటుంబ స‌భ్యుల స్టిక్క‌ర్లు వేసుకోకూడ‌దు

మీడియా యాజ‌మాన్యాల గుర్తింపు కార్డు ఉంటేనే ప్రెస్ స్టిక్క‌ర్‌

న‌కిలీల ఏరివేత‌లో శ్రీ‌కాళ‌హ‌స్తి పోలీసులు_

పోలీస్‌..ప్రెస్ స్టిక్క‌ర్ క‌నిపిస్తే కేసులే..!
పోలీసు పిల్ల‌లు, బంధువులు, కుటుంబ స‌భ్యుల స్టిక్క‌ర్లు వేసుకోకూడ‌దు
మీడియా యాజ‌మాన్యాల గుర్తింపు కార్డు ఉంటేనే ప్రెస్ స్టిక్క‌ర్‌
న‌కిలీల ఏరివేత‌లో శ్రీ‌కాళ‌హ‌స్తి పోలీసులు

పోలీసు.. ప్రెస్ స్టిక్క‌ర్ల‌తో బైక్‌లు, కార్లు, ఇత‌ర వాహ‌నాదారులు అక్ర‌మంగా తిరుగుతూ.. నేరాలు, ఇత‌ర అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డంతోపాటు అర్హుల‌కు చెడ్డ పేరు తీసుకొస్తుండ‌టంతో.. తిరుప‌తి జిల్లా వ్యాప్తంగా పోలీస్‌.. ప్రెస్ స్టిక‌ర్లుతో తిరుగుతున్న వాహ‌నాల త‌నిఖీ చేప‌డుతూ.. తగు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శ్రీ‌కాళహ‌స్తి డీఎస్పీ ఆదేశాల‌తో.. టూ టౌన్ పోలీస్ స్టేష‌న్ సీఐ నాగార్జున్‌రెడ్డి త‌న సిబ్బందితో.. బుధ‌వారం శ్రీకాళహస్తి మండలం లోని బేరువారి మండపం వద్ద వాహనాలను తనిఖీ చేప‌ట్టారు. వాహనాలపై పోలీస్ స్టిక్కర్లు.. ప్రెస్ స్టిక్కర్లు వేసుకొని అనధికారకంగా చలామణి అవుతున్నటువంటి వాహనాలను తనిఖీ చేసి పోలీస్‌.. ప్రెస్ స్టిక్క‌ర్లు.. తొల‌గించారు. ప్రతి ఒక్క‌ వాహనదారులు ఆయా యాజమాన్యం గుర్తింపు కార్డు ఉండాల‌ని.. అలాగే.. పోలీసు స్టిక్క‌ర్ల‌ను వారి కుటుంబ స‌భ్యులు, బంధువులు వేసుకోవ‌డం నేరం అన్నారు. గుర్తింపు కార్డు లేని వారిపై కేసులు న‌మోదుచేసి.. చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప్ర‌క్రియ ఒక్క‌రోజుతో ఆగ‌ద‌ని.. నిరంత‌రంం కొన‌సాగుతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *