_కావలిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
కళాశాల విద్యార్థులకు నాటి ఎమర్జెన్సీ ఘటనలను వివరించిన బిజెపి నాయకులు
చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు….
- కావలిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
- కళాశాల విద్యార్థులకు నాటి ఎమర్జెన్సీ ఘటనలను వివరించిన బిజెపి నాయకులు
కావలిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం జరిగింది. విద్యార్థులకు నాటి ఎమర్జెన్సీ ఘటనలను బీజేపీ నేతలు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని రద్దుచేసి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యవస్థను తీసుకువచ్చి ఒక నియంతగా వ్యవహరించారని నెల్లూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. కావలిలో బుదవారం బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బిజెపి నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నాటి ఎమర్జెన్సీ ఘటనలను వివరించారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25 వ తేదీన ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు అని సురేష్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత కుమార్, బీజేపీ నాయకురాలు అంచిపాక కమల, జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం, రాష్ట్ర సహ కోశాధికారి కందుకూరి సత్యనారాయణ, కావలి అసెంబ్లీ కన్వీనర్ సివీసీ సత్యం , పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ , పరుసు వెంకటేశ్వర్లు , మురళీ కృష్ణ , bjym జిల్లా అధ్యక్షుడు గుత్తా అశోక్ నాయుడు, సవీంద్ర తదితరులు ఉన్నారు.